ప్రధాని మోదీ హస్యచతురత చూస్తే సూపర్ అనాల్సిందే

ప్రధాని మోదీ హస్యచతురత చూస్తే సూపర్ అనాల్సిందే

0
81

నిన్న సూర్యగ్రహణం అందరూ చూశారు, మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి మీడియాలలో వార్తలు వచ్చాయి. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీ వ్ గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ కూడా ఓ పోస్ట్ చేశారు.
నిన్న మేఘాల కారణంగా తాను సూర్యగ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని, ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు అలాగే . ఇందుకు సంబంధించి ఓ ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

దానిపై నెట్టింట జోకులు పేలాయి. మీమ్స్ వైరల్ అయ్యాయి. ప్రతి నెలా తాము జీతాల కోసం ఇలాగే ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కొందరు జోకులు వేశారు. ఇక ఈ విషయాన్ని వివరిస్తూ, ఓ యువకుడు మోదీకి ట్వీట్ చేస్తూ, ‘సార్… మీ ఫొటోపై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి’ అని చెప్పగానే, ఆశ్చర్యకరంగా మోదీ వెంటనే స్పందించారు. మోస్ట్ వెల్ కమ్… ఎంజాయ్ అని సమాధానం ఇచ్చారు.

దీంతో మోదీ సరదాగా తీసుకున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోదీ చాలా కూల్ అని ఆయనని ప్రశంసిస్తున్నారు, అలాగే ఎలాంటి ఫోటోలు వీడియోలు వైరల్ అయినా ఆయన పెద్ద పట్టించుకోరు ప్రజా సేవే అని ఆయన చెబుతూ ఉంటారు తాజా సమాధానంతో ఆయనలోని హస్య చతురత సైతం బయటపడింది.