జగన్ కు అధికారం జాతీయమీడియా సర్వే రిలీజ్

జగన్ కు అధికారం జాతీయమీడియా సర్వే రిలీజ్

0
99

ఏపీలో ఈ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ధీమా అని ఓ పక్కా ఎల్లో మీడియా పబ్లిసీటీ చేస్తోంది.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రావు అని, జగన్ పార్టీకి 130 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నాయి జాతీయ సర్వేలు… తాజాగా ఏపీలో వినిపించే ఏ సర్వే అయినా జగన్ కు పట్టం కడుతున్నాయి.. మరో పక్క జాతీయ స్ధాయిలో మీడియాలు కూడా ఇప్పటికే 130 సీట్లు జగన్ కు రావడం పక్కా అని చెబుతున్నారు.. అంతేకాదు ఎంపీ సెగ్మెంట్లు కూడా సుమారు 20 సీట్లు గెలుస్తారు అని వైసీపీకి పట్టం కడుతున్నాయి …అయితే జగన్ కు తాజాగా మరో జాతీయ మీడియా సర్వే గెలుపు పక్కాగా తెలియచేసింది.

ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించి. ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేస్తాయని తెలిపింది. తర్వాత వైసీపీ కీలకంగా మారుతుంది అని తెలియచేసింది .. వైసీపికి ఇలాంటి వేవ్స్ ఉండటంతో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. టీడీపీకి జాతీయ మీడియాల నుంచి ఒక్కటి కూడా సపోర్ట్ రాలేదు, దీంతో ఎలాంటి పరిస్దితి ఈ ఎన్నికల్లో కనిపిస్తుందా అని డైలమా అయితే ఉంది. మరో పక్క జగన్ కు పెద్ద ఎత్తున ప్రజల నుంచి, జాతీయ మీడియా నుంచి సపోర్ట్ రావడంతో పార్టీ నేతలు అందరూ హ్యాపీగా ఉన్నారు.