నేను ఆ పని చేయను జగన్ సంచలన ప్రకటన

నేను ఆ పని చేయను జగన్ సంచలన ప్రకటన

0
82

ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన చేసిన సమయంలో సినిమా గ్రాఫిక్స్ చూపించి రాజధాని నిర్మాణం ఇలా పూర్తి చేస్తాము అని చెప్పారు, అయితే అప్పుడు వైసీపీ దీనిపై గట్టి కౌంటర్లు ఇచ్చింది.. ఏదైనా పూర్తిగా నిర్మాణం చేస్తాము అని చెబుతారు కాని ఇక్కడ గ్రాఫిక్స్ చూపించి ప్రజలని మభ్య పెట్టారని అసలే అప్పుల్లో ఉన్న ఏపీకి కేంద్రం సాయం చేయని సమయంలో ఈ గ్రాఫిక్స్ లు చూపించడం ఏమిటి అని విమర్శలు వచ్చాయి.

తాజాగా ఏపీకి రాజధానిగా పరిపాలన కేపిటల్ గా విశాఖని ఫిక్స్ చేశారు సీఎం జగన్, ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ సమయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి బాహుబలి లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని నేను అనుకోవట్లేదు. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. నేను చేసేది మాత్రమే చెబుతాను చేయనిది, నా వల్ల కానిది నేను చెప్పను అన్నారు సీఎం జగన్.. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అని తెలిపారు. అన్నీ ప్రాంతాల డవలప్ మెంట్ కోరుకుంటున్నాము అన్నారు ఆయన.