నేరుగా వారి ఖాతాలో జూన్ 4 న పది వేలు జమ – సీఎం జగన్

నేరుగా వారి ఖాతాలో జూన్ 4 న పది వేలు జమ - సీఎం జగన్

0
96

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తోంది, నవరత్నాలను కూడా అమలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా ఏడాదిలోపు ఇచ్చిన హమీలు నెరవేరుస్తున్న సర్కారుగా పేరు తెచ్చుకుంది.. పాదయాత్రలో నాడు పేదల సమస్యలు నేరుగా చూసిన సీఎం జగన్ నేడు అవన్నీ తీరుస్తున్నారు అని చెప్పాలి.

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త చెప్పారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్ల ఖాతాలలో పది వేల రూపాయలు జమ చేయనున్నారు. వారికి ఆర్ధికంగా సహయం అందచేయనున్నారు.

ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఈ పథకానికి 33,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది లబ్ది పొందిన వారికి కూడా నేరుగా నగదు జమ చేస్తారు, జూన 4వ తేదీన 10,000 రూపాయలు ఖాతాలలో జమ చేయనుంది. గతంలో లబ్ది పొందిన వారికి మళ్లీ అప్లై చేసుకోవక్కర్లేదు అని తెలిపింది సర్కార్.