నేతలకు బాబు భరోసా డోంట్ వరీ

నేతలకు బాబు భరోసా డోంట్ వరీ

0
81

ఏపీలో రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీపై కుట్ర జ‌రుగుతోంది అని, కావాల‌నే వైసీపీ నేత‌లు తెలుగుదేశం నేత‌లతో చర్చ‌లు జ‌రిపి వారిని పార్టీ మార్చేయోచ‌న‌లో ఉన్నారు అని విమర్శిస్తున్నారు.. టీడీపీ నేతలు ముఖ్యంగా సీనియర్లు ముగ్గురిని పార్టీ నుంచి తీసుకువెళ్లేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.. అయితే దీనిపై చంద్రబాబు ఆ సీనియర్ నేతలతో ఫోన్ లో మాట్లాడారు.

తాము పార్టీ మారే ఆలోచనలో లేము అని చెప్పినా కచ్చితంగా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అని బాబుకు రిపోర్టులు చెబుతున్నాయి… ముఖ్యంగా పదవులు వచ్చే అవకాశం వైసీపీలో లేదు.. కాని పార్టీ మారాలి అని నేతలు భావిస్తున్నారట. మరో ఐదు సంవత్సరాలు రాజకీయంగా టీడీపీలో ఉండే పరిస్దితి లేదు అని భావిస్తున్నారట సదరు నేతలు.

ముఖ్యంగా జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.. అంతకు ముందే పార్టీ నేతలతో చంద్రబాబు మరోసారి ఫోన్లో చర్చించి బుజ్జగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది..