ప్రజలకు మళ్ళీ నోట్ల కష్టాలు

ప్రజలకు మళ్ళీ నోట్ల కష్టాలు

0
114

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 500 , 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తరువాత దేశ ప్రజలు చాల ఇబ్బందులు పడ్డారు. పైగా ఆ టైములో 2000 నోటు రిలీజ్ చేసింది ప్రభుత్యం. దీనితో 2000 నోటుకు చిల్లర దొరకక, డబ్బులు కోసం బ్యాంకులు, ఎటిఎం లు చుట్టూ క్యూ కట్టారు జనం. ఈ పెద్ద నోట్ల రద్దుతో RBI కూడా చాల ఇబ్బందులు ఎదుర్కొంది. కొత్త నోట్ల ముద్రణకు భారీగా ఖర్చువ్వడం దీనికి తోడు నకిలీ నోట్ల బెడద కూడా తీవ్రం గానే ఉండేది.

ఇప్పుడు వీటన్నిటి నుండి ఉపశమనం పొందే దిశగా ప్రస్తుతం ఆర్బీఐ పావులు కదుపుతుంది. చింపినా చిరగకుండా, తడిపినా తడవకుండా ఉండేలా కొత్త కరెన్సీ ముద్రణకు సిద్ధమైంది. అదే… వార్నిష్ట్ కరెన్సీ. ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నికలో ఉంటాయి. అంతేకాదు నోట్ల సెక్యూరిటీ ఫీచర్స్ కోసం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.అంతే కాకా ఈ నోట్ల జీవితకాలం ఎక్కువ ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇక పాత నోట్లను రీప్లేస్ చేయాల్సిన అవసరం తగ్గుతుందని మరియు సెక్యూరిటీ ఫీచర్స్ కోసం చేసే ఖర్చు బాగా తగ్గుతుందని అంచనావేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వార్నిష్ట్ నోట్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించాం’ అని ఆర్బీఐ ప్రకటించింది.