టీడీపీలోకి కొత్త వారు ఎంట్రీ….

టీడీపీలోకి కొత్త వారు ఎంట్రీ....

0
84

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… పార్టీలో చంద్రబాబు నాయుడు కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కొత్తగా ఇంచార్జ్ లను నియమించారు…

సుమారు నాలుగు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్ లను నియమించారు చంద్రబాబు… గుడివాడకు రావి వెంకటేశ్వరరావు మాచర్లకు కొమ్మారెడ్డి చలమారెడ్డి, ఏలూరుకు బడ్డేటి రాధాకృష్ణా బాపట్లకు వేగేశ్వ నరేంద్రవర్మ లను నియమించారు… ఇప్పటికే గుంటూరు పశ్చిమకు రవీంద్రను నియమించిన సంగతి తెలిసిందే…

ఇక గన్నవరం సెగ్మెంట్ కు ఇంచార్జ్ ను నియమించలేదు… గుడివాడ టీడీపీ ఇంచార్జ్ వైసీపీ తీర్ధం తీసుకోగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రెబల్ గా మారారు.. ఒక గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే కూడా సైకిల్ కు దూరంగా ఉంటున్నారు….