గన్నవరంపై టీడీపీ సరికొత్త ప్లాన్

గన్నవరంపై టీడీపీ సరికొత్త ప్లాన్

0
128

గ‌న్న‌వ‌రం పంచాయ‌తీ ఇప్పుడు తేలేలా కనిపించడం లేదు.. అయితే ఇక్కడ నుంచి వైసీపీ తరపున టికెట్ పొంది వల్లభనేని వంశీ పోటీ చేస్తారు అని పక్కాగా తెలుస్తోంది. అయితే వైసీపీ జెండా జగన సిద్దాంతాలు ఆయన నవరత్నాలు నచ్చి ఓట్లు వేసారు అని చెప్పుకునేందుకు కూడా, ఇక్కడ గన్నవరం వైసీపీకి వరంగా మారుతుంది అని చూస్తున్నారు వైసీపీ నేతలు.

అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ నుంచి దేవినేని ఉమాని రంగంలోకి దించాలి అని చూస్తున్నారు, ఉమా అయితే ఇక్కడ వంశీపై సరైన నేత అవుతారు అని భావిస్తున్నారు.. యార్లగడ్డ పార్టీ మారి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు.. అందుకే ఇక్కడ నుంచి దేవినేని ఉమాకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట… వేరే వారికి ఇచ్చినా ఆర్దికంగా సపోర్ట్ నిలిచినా గెలుస్తారు అనే నమ్మకం లేదట.. అందుకే గన్నవరంలో పొలిటికల్ వార్ దేవినేని వర్సెస్ వల్లభనేని అవుతుంది అంటున్నారు అక్కడ జనం.