ఏపీలో న్యూ పొలిటికల్ ఎపిసోడ్…

ఏపీలో న్యూ పొలిటికల్ ఎపిసోడ్...

0
88

అమరావతి చుట్టూ ఏమి జరుగుతుంది ఇప్పుడు మరోసారి అందరి చర్చ ఇటీవల హిందూ మహాసభ దక్షిణభారత రామాలయంకట్టనున్నట్లు ప్రకటన తర్వాత మొదలైంది… రాజధానిని ఇక్కడే ఉంచాలని 200 రోజులు ఉద్యమించినా కరోనా మహమ్మారి ఈ పోరాటం పై నీళ్లు చల్లేసింది.. ఇప్పటికే కోర్టు ల ద్వారా ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది…

అయినా కానీ జగన్ సర్కార్ తన అడుగులు దాజధాని వికేంద్రీకరణ దిశగా సాగుతుంది…దాంతో కొత్త తరహాలో ఈ ఎపిసోడ్ లో బీజేపీ కథ నడిపించేందుకు రామాలయ ఎజండా తో వ్యూహం రూపొందించిందా అన్న అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు… హిందూ మహా సభరామాలయ ప్రకటన ఇలా జరిగిందో లేదో బీజేపీ ఎంపీ భారీ విరాళం ప్రకటించారు…

సుజనా విరాళం తోనే రామాలయం వెనుక ఏదో జరుగుతుందనే అనుమానాలు వినపడుతున్నాయి.. అమరావతి ప్రాంతాన్ని బీజేపీ ఓన్ చేసుకునేందుకు ఈ కార్యచరణ తీసుకుంటుందా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో వినవస్తున్నాయి… లేకపోతే విజయవాడ ను హిందూ మహాసభ ఎందుకు ఎంచుకుంటారన్నది అంటున్నారు…