టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు, ఇక ఫిబ్రవరి లో రధసప్తమి రోజున ఈ ముహూర్తం అని వార్తలు వినిపిస్తున్నాయి… అయితే దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోయినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయనకు విషెస్ చెబుతూ ఉండటంతో ఇది నిజం అని భావిస్తున్నారు అందరూ.
అయితే ఇప్పుడు మంత్రుల్లో కొత్త టెన్షన్ నెలకొందట.. యువనేత కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తే ప్రస్తుతం కేబినెట్లో ఉన్న కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక యువ నేతలకు మంత్రి పదవులుఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
గతంలోనే కేబినెట్ ప్రక్షాళన చేపట్టాలని కేసీఆర్ అనుకున్నారట.. కాని ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేటీఆర్ వస్తే ఇక కొత్త మంత్రులు వస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి…కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆయన మంత్రివర్గం మొత్తం రద్దవుతుంది. మళ్లీ కొత్త మంత్రి వర్గం వస్తుంది. అప్పుడు కొత్త మంత్రులుగా కొందరు వచ్చే చాన్స్ ఉంది అని తెలుస్తోంది. మరి చూడాలి పొలిటికల్ గా ఈ అంశం తెలంగాణలో బాగా వైరల్ అవుతోంది.