వైసీపీలో మరో కొత్త టెన్షన్…

వైసీపీలో మరో కొత్త టెన్షన్...

0
94

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల మధ్య రోజు రోజుకు గ్యాప్ మరింత పెరుగుతుందా, వారి ఆవేదనకు అంతే లేదా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన సీనియర్లు చాలా మందే ఉన్నారు…

వీరిలో చాలా మంది మంత్రి పదవులు మొదలుకుని నామినేటెడ్ పదవులను ఆశించేవారు చాలామంది ఉన్నారు… అయితే ప్రస్తుతం వీరెవ్వరిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇక వీరి కష్టాలకు కరోనా తోడు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట…

ఇటు పనులు కాక అటు ప్రయార్టీలేక కక్కలేక మింగలేక కాలం వెళ్లదీస్తున్నారని వార్తలు వస్తున్నాయి… సీనియర్లుగా ఉన్న తమకు ఏ పదవి లేదని తమకంటే జూనిర్లుకు రెండు మూడు పదవులు కట్టబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట… మరి వీరి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.