తెలంగాణలో కొత్త ట్రెండ్ : ఈటల రాజేందర్ పాలాభిషేకం ఎవరికంటే? (వీడియో)

New trend in Telangana: Etala Rajender Palabhishekam

0
96

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటినుంచి నేటివరకు ఏడేళ్ల కాలంలో అనునిత్యం ఎక్కడో ఒకచోట ఒక వ్యక్తికి పాలాభిషేకాలు జరిగాయి. ఆయనెవరో కాదు తెలంగాణ సిఎం కేసిఆర్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వందలసార్లు కేసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగాయి. అన్ని జిల్లాల్లో పాలాభిషేకాలు జరిగాయి. అయినదానికి కానిదానికీ పాలాభిషేకాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు జనాలు.
సిఎం హోదాలో కేసిఆర్ ఒక ప్రకటన ఇవ్వడం… వెనువెంటనే గులాబీ శ్రేణులు రంగంలోకి దిగి పాలాభిషేకాలు చేయడం నిత్యకృత్యమైన పరిస్థితి ఉంది. ప్రతిసారి పాలాభిషేకాలు చేస్తుండడంతో కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలకు పాల పాకిట్ల బ్యాచ్ అనే బిరుదులు కూడా తగిలించారు జనాలు. తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ప్రభుత్వ హయాంలో ఈ పాలాభిషేకాలు ట్రెండ్ మామూలుగా లేదు. తుమ్మినా… దగ్గినా పాలాభిషేకాలు చేసేశారన్న విమర్శలు సైతం విపక్షాల నుంచి వినిపించాయి. రెండో టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా పాలాభిషేకాల ఫ్లో తగ్గినట్లు కనబడుతున్నది.
ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన తర్వాత పాలాభిషేకం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈటల. అనంతరం ఆయన వీనవంక మండల పర్యటనకు బయలుదేరారు. తెలంగాణలో కేసిఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం చూసీ చూసీ అలసిపోయిన జనాలకు ఈటల రాజేందర్ కొత్తగా పాలాభిషేకం చేయడం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి ఈటల పాలాభిషేకం చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈటల పాలాభిషేకం చేసిన వీడియో కింద ఉంది చూడొచ్చు.

https://fb.watch/6hftq0MONM/