చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచంలోని దేశాలన్నింటినీ గజగజా వణికిస్తోంది… ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతోంది. 1000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిత్యం చైనాలో నమోదు అవుతున్నాయట. ఇక దాదాపు 2200 మంది ఈవైరస్ సోకి చనిపోయారు.
ఇప్పటి వరకూ వైరస్ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది. ఒక పక్క కరోనా వైరస్ వ్యాపిస్తుందేమోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా బాధ అలా ఉంటే ఇటు వైపు H1N1 వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతోంది.అయితే ఇది వాతావరణ మార్పుల వలన బాగా వస్తుంది, ఇప్పటికే ఏపీ తెలంగాణలో
H1N1 63 కేసులు నమోదు అయ్యాయి.
63 మంది స్వైన్ ఫ్లూ బారిన పడగా వీరిలో ఐదుగురు ఇప్పటికే మరణించారు. ఈ వ్యాధి వస్తే రోగనిరోధక శక్తి తగ్గుతుంది, ముఖ్యంగా జలుబు దగ్గు పెరుగుతుంది.. వారం అయినా జ్వరం తగ్గదు.. ఈ లక్షణాలు వారం కంటే ఎక్కువగా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లండి. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, క్యాన్సర్ బారిన పడిన వారికి, ఆస్తమా రోగులకు, గర్భిణీ స్త్రీలకు సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు.