వంగవీటి రాధా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన తర్వాత ఆయన రాజకీయంగా మరింత సైలెంట్ అయ్యారు… పార్టీ మళ్లీ గెలుస్తుంది అని అనుకుని ఆయన చంద్రబాబు దగ్గర చేరారు.. జగన్ పై అనేకమైన విమర్శలు చేశారు.. చివరకు వైసీపీ ఘన విజయం సాధించింది.. దీంతో వంగవీటి ఈసారి ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో రాజకీయంగా ఇబ్బంది పడ్డ నాయకుడు అనే చెప్పాలి.. వైసీపీ నేతలు ఎంత చెప్పినా ఆయన మాత్రం పార్టీ మారిపోయారు.
అయితే ఆయన మళ్లీ వైసీపీకి దగ్గర అవుతారు జనసేనలో చేరుతారు అని వార్తలు వినిపించాయి.. కాని అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే ఉన్నారు, తాజాగా నిన్న విజయవాడలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి ఆయన ఇంటికి తరలించారు… ఈ సమయంలో టీడీపీ నేతలు జిల్లా నాయకులు అందరూ ఉన్నారు, అయితే విజయవాడలో కాబట్టి రాధా వస్తారు అని అందరూ అనుకున్నారు కాని రాధా మాత్రం రాలేదు.
కాని రాత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాధా నిన్న అర్ధరాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిదగ్గరకు వెళ్లారు, ఈ
సమయంలో చంద్రబాబు బిజీగా ఉండటంతో ఆయనని కలవలేకపోయారు, అంతేకాదు లోకేష్ విజయవాడ నేతలతో ఆయన మాట్లాడారట.దీంతో ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారని ఓ క్లారిటీ అయితే ఇచ్చారు, ఆయన పార్టీ మారుతారు అనే వార్తలకు బ్రేకులు ఆయనే వేశారు అని చెప్పాలి.