నిర్భయ కేసు దోషులతో ఈ 10 రోజులు ఎలాంటి పని చేయిస్తారో తెలుసా

నిర్భయ కేసు దోషులతో ఈ 10 రోజులు ఎలాంటి పని చేయిస్తారో తెలుసా

0
39

నిర్భయ కేసులో అత్యాచారానికి పాల్పడిన దోషులకు జనవరి 22వ తారీఖున ఉరిశిక్ష అమలు చేయనున్నారు. అయితే దీనికి ఇక మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆరోజు ఉదయం వీరు నలుగురికి ఉరి అమలు చేస్తారు… ఇక వారిని ఉరితీసేందుకు అన్నీ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.
మరి జనవరి 22వ తారీకు వరకు ఈ నలుగురు దోషుల విషయంలో తీహార్ జైలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అసలు ఈ పది రోజులు వారు ఏం చేస్తారు అనేది చూద్దాం.

ఈ నలుగురు దోషులని ఇకపై ఐసోలేటెడ్ జైళ్లలో ఉంచుతారు. నలుగురిని కలిపి ఒకే సెల్ లో అస్సలు ఉంచరు.. విడివిడిగా నలుగురిని ఉంచుతారు.
నలుగురు నిందితులతో రోజువారి జైలు పని చేయించరు…22వ తారికున ఉరిశిక్ష పడే అంతవరకు వీరితో ఎవ్వరూ మాట్లాడరు. అలాగే వీరిని ఎవరితో కలవనివ్వరు. కుటుంబంలో ఒకరికి మాత్రమే వీరిలో మాట్లాడే అవకాశం కల్పిస్తారు.. అది కూడా కొద్ది నిమిషాలు మాత్రమే, ఉరితీతకు ముందు రోజు అవకాశం కల్పిస్తారు.

ఇక చివరి కోరిక కూడా అడిగి తెలుసుకుంటారు.. వారి కోరిక తీరుస్తారు. క్షణక్షణం మృత్యువు గురించి మాత్రమే ఆలోచించేలాగా పరిస్థితులు కల్పిస్తారు.
వీరు నలుగురికి రోజూ శారీరిక మానసిక ఆరోగ్య పరీక్షలు జరుపుతారు.. వీరి నలుగురి పై ఆస్తి ఉంటే ఆస్తి ఎవరి పేరున రాయాలి అనుకుంటున్నారు అనేది కనుక్కుని ఆ మేరకు వారితో విలునామా రాయిస్తారు. దీనికి కోర్టు లాయర్ ని పంపిస్తుంది. ఉరితీసేముందు తలారి మరో ముగ్గురు అధికారులు జైలు సిబ్బంది ఉంటారు.. ఓ రోజు ముందు ఓసారి డమ్మీలను పెట్టి ఉరి తీసే ప్రక్రియను ప్రాక్టీస్ చేస్తారు తలారి.