ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రైతు పక్షపాతిగా తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటున్నారు జగన్… రైతు గిట్టు బాటు ధర రైతు భరోసా ఇన్ పుట్ సబ్సిడీ ఇలా అనేక రూపాల్లో సాహాయం చేస్తున్నారు…
ఇక ఇప్పుడు రాయలసీమ రైతుల విషయంలో మరింత గట్టి పట్టుదలతో ముందుకు సాగాలని నిర్ణయించారు.. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు మీదుగా రాయలసీమకు జలాలను తరలించే విషయంలో సర్కార్ వెనక్కి తగ్గకుంది.. 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమని 851 ఆడుగుల్లో ఉంటే 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమని ఇలాంటి పరిస్థితుల్లో రాయసీమ కరువు ఎలా తీర్చాలి అని ఇటీవలే పరోక్షంగా తెలంగాణ సీఎం ప్రశ్నించారు జగన్…
800 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లను తీసుకెల్తోందని అదే 800 అడుగుల వద్ద మనకు కేటాయించిన నీళ్లను మనం తీసుకుందామని అంటున్నారు… ఇలా తీసుకోవడం వల్ల ఎవరికి నష్టం కాదని అంటున్నారు…