ఆనాడు వద్దు..నేడు ముద్దు..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

No, don't kiss today. CPI Secretary of State Interesting remarks

0
68

ఆనాడు వద్దన్న ఇందిరా పార్కు ధర్నా చౌక్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి నేడు ముద్దుగా కనిపిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను నిషేధించింది. దాన్ని సాధన కొరకై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాల ద్వారా తిరిగి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను సాధించుకున్న మన్నారు. ఆనాడు వద్దన్న టిఆర్ఎస్ ప్రభుత్వం, నేడు అదే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవడానికి కావలసి వచ్చింది అన్నారు.

ఊరి చివరన ధర్నాలు చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ మేము ఇందిరా పార్క్ లో ధర్నాలు చేపడితే మాపై కేసులు పెట్టి, లాఠీలతో కొట్టారన్నారు. నేను, పిఎల్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ వేయగా దశల వారీగా నిబంధనలు పెడుతూ ఇందిరా పార్క్ లో ధర్నాలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రజల గొంతుకలను ప్రభుత్వానికి తెలియజేయడానికి అవకాశం దొరికింది. నేటి ప్రభుత్వాలు ఎప్పటికైనా ప్రతిపక్షంలోకి రావాల్సిందే, ప్రజల గొంతుకలను ఉద్యమాల రూపంలో ప్రభుత్వానికి తెలియ చేయాల్సిందేనని వారు గుర్తు చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల నేడు రాష్ట్రంలో ఒడ్లు కొనే పరిస్థితి లేదని వాపోయారు. బిజెపి, టిఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ డ్రామాలాడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రైతులు నలిగి పోతున్నారని, వెంటనే రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు చాడ వెంకట్ రెడ్డి .