తెరపైకి నూతన్ నాయుడు మరో మోసం….

తెరపైకి నూతన్ నాయుడు మరో మోసం....

0
91

బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన్ నూతన్ నాయుడు మరో అక్రమం బటయపడింది… ఇప్పటికే ఆయన, ఆయన భార్యతోపాటు మరికొందరు శిరోమండనం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే… తాజాగా తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ఏపీకి చెందిన మరో వ్యక్తి ఇద్దరు కలిసి నూతన్ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు…

తమకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి నూతన్ నాయుడు 12 కోట్లు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు… శ్రీకాంత్, నూకరాజు ఇద్దరు స్థిరాస్థి వ్యాపారస్తులు… వీరికి గతంలో నూతన్ నాయుడుతో పరిచయం ఏర్పడింది… కొన్నిరోజులకు ఈ ముగ్గురి మధ్య స్నేహం మరింత పేరిగింది… కొన్నిరోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నూతన్ నాయుడు తమతో చెప్పాడంతో తాము నమ్మి డబ్బులు చెల్లించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు…

దక్షిణ భారత రీజినల్ డైరెక్టర్ పోస్టుకు 12 కోట్లు ఇచ్చానని అలాగే సాధారణ జాబ్ కోసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పారు.. దీంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…