ఒక్క ఫుడ్ ఆర్డ‌ర్ వారికి భ‌యం అంటే ఏమిటో చూపించింది.

ఒక్క ఫుడ్ ఆర్డ‌ర్ వారికి భ‌యం అంటే ఏమిటో చూపించింది.

0
110

ఈ క‌రోనా టైమ్ లో బ‌య‌ట రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులు తెరుచుకోలేదు, ఈ స‌మ‌యంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకునే సౌల‌భ్యం క‌ల్పించారు, దీంతో చాలా మంది మెట్రో సిటీల్లో ఇలా ఆన్ లైన్ ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుంటున్నారు, కాని డెలివ‌రీ చేసే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు ఆ డెలివ‌రీ బాయ్ తీసుకోవాలి అని తెలిపింది ప్ర‌భుత్వం.

న్యూఢిల్లీలోని మాలవీయ నగర్‌కు చెందిన 72 కుటుంబాలు 15 రోజులుగా తరచూ పిజ్జాను ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటూ వచ్చారు. ఒకే ప్రాంతం కావడం వల్ల ఒకే వ్యక్తి ఆయా కుటుంబాలందరికీ పిజ్జాను డెలివరీ చేశారు. మూడు రోజుల క్రితం అత‌ను ఆరోగ్యం బాగోక టెస్ట్ చేయించుకుంటే క‌రోనా అని తేలింది, దీంతో వారు అంద‌రూ క్వారంటైన్ కు వెళ్లారు.

భ‌యంతో ఒక్క‌సారిగా 72 కుటుంబాల వారు క్వారంటైన్‌కు పరుగులు పెట్టారు. ఆయా కుటుంబాల్లోని కొందరు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. మరి కొందరు ఆసుపత్రులను ఆశ్రయించారు. డోర్ డెలివరీ సిబ్బంది అందరికీ మాస్కులు, గ్లోవుజ్‌లను అందజేశామని ఈ వైర‌స్ 100 శాతం ఆ ఫ్యామిలీల‌కి సోకి ఉండ‌దు అంటున్నారు యాజ‌మాన్యం కాని జాగ్ర‌త్త అవ‌స‌రం అని వైద్యులు చెప్పారు.ఇక ఆ ఐదు కిలోమీట‌ర్ల రేడియేష‌న్ లో ఎవ‌రైనా పిజ్జా ఆర్డ‌ర్ చేసి తెప్పించుకుని ఉంటే, వారు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్ లో ఉండాలి అని అక్క‌డ అధికారులు చెబుతున్నారు.