తెలంగాణ‌లో 20 త‌ర్వాత ఇవి తెరుచుకోవ‌చ్చు? వీటికి బిగ్ రిలీఫ్ ?

తెలంగాణ‌లో 20 త‌ర్వాత ఇవి తెరుచుకోవ‌చ్చు? వీటికి బిగ్ రిలీఫ్ ?

0
33

తెలంగాణ‌లో హైద‌రాబాద్ లోనే ఎక్కువ‌గా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.. కొన్ని జిల్లాలు అయితే గ్రీన్ జోన్ గానే ఉన్నాయి. అక్క‌డ పెద్ద కేసులు న‌మోదు కావ‌డం లేదు, ఇలాంటి వాటికి ఈ నెల 20 నుంచి స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉంది.. పూర్తిగా అన్నీ తెరుచుకోక‌పోయినా గ్రీన్ జోన్ల ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారుల‌కి స‌డ‌లింపు ఇచ్చే అవ‌కాశం ఉంది అంటున్నారు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీ త‌ర్వాత ఈ విష‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

1..గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను ఏప్రిల్‌ 20 నుంచి తెరుచుకోవచ్చు.

2..సెజ్‌లు, ఎగుమతి ప్రధాన కేంద్రాలు, పారిశ్రామిక వాడల్లో కార్మికులు ప‌ని చేసుకునే అవ‌కాశం ఉంటుంది

3.. గ్రామాలు గ్రీన్ జోన్స్ లో ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్‌ రిపేర్లు, ప్లంబర్లు, మోటార్‌ మెకానిక్‌లు, కార్పెంటర్లు తమ తమ పనులు చేసుకోవచ్చు.

4.. హైవేల‌పై దాబాలు తెరిచే అవ‌కాశం ఉంటుంది సామాజిక దూరం నీట్ నెస్ ఉండాలి.

5. ప్ర‌భుత్వ ప్రాజెక్ట ప‌నులు రోడ్డు నిర్మాణాల‌కు ప‌ని చేసుకోవ‌చ్చు

6..సరుకుల దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు , పాల బూత్ లు, కిరాణా షాపులు తెరిచే అవ‌కాశం ఉంటుంది,

7…చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు తెరుచుకోవచ్చు.

8.. తినుబండారాలు, నిత్య అవ‌స‌రాల స‌రుకులు గూడ్స్ ర‌వాణా ఉండ‌వ‌చ్చు

9.. లోక‌ల్ లో గ్రీన్ జోన్ల ఏరియాలో ఈ-కామర్స్‌ కంపెనీలు, వాటి వాహనాలను తగిన అనుమతులు తీసుకుని నడపవచ్చు.

10..బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిగా గ్రీన్ జోన్లో ప‌ని చేయ‌వ‌చ్చు

11..గుట్కా, పాన్‌ మసాలాలు, నమిలే పొగాకు, సిగరెట్ల అమ్మకాలు ఎక్క‌డా ఉండ‌వు

12.. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తెర‌చుకోవ‌చ్చు

13.. వ్య‌వ‌సాయ ప‌నులు జ‌రుపుకోవ‌చ్చు

14. మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి, వీటిపై తెలంగాణ స‌ర్కార్ ఈ నెల 19న కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది. రెడ్ జోన్లు క‌చ్చితంగా మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ పాటించాల్సిందే.