ఒక్క మొబైల్ నెంబర్ తో ఇంట్లో అందరికి ఆధార్ కార్డ్ ఇదే అప్లై చేసుకునే లింక్

ఒక్క మొబైల్ నెంబర్ తో ఇంట్లో అందరికి ఆధార్ కార్డ్ ఇదే అప్లై చేసుకునే లింక్

0
74

మీరు మీ ఆధార్ కార్డుని ఇంటర్ నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే, కచ్చితంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాల్సిందే, లేకపోతే మీకు ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ అవ్వదు, అయితే మీకు ఒకవేళ మొబైల్ నెంబర్ దానికి లింక్ అవ్వకపోయినా మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, మరి దానికి ప్రాసస్ ఏమిటి అనేదిచూద్దాం.

తాజాగా యూఐడీఏఐ పాలివినైల్ క్లోరైడ్ కార్డ్ PVC Card లను తీసుకువచ్చింది. ఇవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డును పోలి ఉంటాయి. మీ పరసులో ఈజీగా ఇమిడిపోతాయి, ఇక మన్నిక కూడా చాలా కాలం ఉంటుంది.. వర్షంలో తడిచినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇక మీ కుటుంబంలో ఎవరో ఒకరి మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఈ పీవీసీ కార్డులు ఆర్డర్ ఇవ్వవచ్చు, మీరు 50 రూపాయలు చెల్లించాలి, ఇంట్లో ఒక వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ పీవీసీ ఆధార్ కార్డుల కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. https://residentpvc.uidai.gov.in/order-pvcreprint ద్వారా పీవీసీ ఆధార్ కార్డు కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్.