ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ( పవన్, చంద్రబాబు )…. ఇదే జగన్ ప్లాన్

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ( పవన్, చంద్రబాబు ).... ఇదే జగన్ ప్లాన్

0
96

రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి… అధికార పక్షాలను దెబ్బ తీయాలని ప్రతిపక్షాలకు ఉంటుంది… ప్రతిపక్షాలు వేసే ఎత్తుగడలను దెబ్బకొట్టాలని అధికార పక్షానికి ఉంటుంది… తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇదే రకమైన ప్లాన్ వేశారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం…

ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు… ఎక్కడ మీడియా దొరికితే అక్కడ వైసీపీపై విమర్శలు చేస్తున్నారు… ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షంలోనే కొనసాగుతుందని అంటున్నారు……

అయితే ఆయన విమర్శలను కట్టుదిట్టం చేసేందుకు జగన్ కొత్త ప్లాన్ వేశారు… అందులో భాగంగానే తాజాగా జగన్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు… టీడీపీతో విడాకులు తీసుకున్న పవన్ వాపక్షాలతో కలిసి పోటీ చేశారు… ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో సీపీఎం సీపీఐలు జనసేనకు దూరం అయ్యాయి…

లాంగ్ మార్చ్ కూడా హాజరు కాలేదు… అందుకే వామపక్షాలకు జగన్ దగ్గర అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం… వామపక్షాలతో కలిసి పోతే స్థానిక సంస్థల్లో తమకు లాభం వస్తుందని వైపీపీ అధిష్టానం భావిస్తోందట.