ఒకే రోజు 10 మందికి కరోనా పాజిటివ్ కేసులు

ఒకే రోజు 10 మందికి కరోనా పాజిటివ్ కేసులు

0
86

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు… రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 59 నమోదు అయ్యాయని తెలిపారు… ఈరోజు ఒక్కరోజే 10 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు… లాక్ డౌన్ విధించినా రాత్రి వేలల్లో కర్ఫ్యూ విధించినా ఈరోజు ఒక్కరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆంధోళనకరం అని అన్నారు…

ప్రజలు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలిపారు… అలాగే ప్రజలు సహకరిస్తున్న తీరును ప్రశంశించారు… రానున్న రోజుల్లో మరింత క్రమశిక్షణ పాఠించాలని అన్నారు… కరోనాకు మందు ఎక్కడా లేదని దీన్ని నివారించడమే మందని అన్నారు కేసీఆర్…

అన్ని వసతులు ఉన్న అమెరికా కూడా ఆగమాగం అవుతుందని అన్నారు… చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలోకి వస్తే సుమారు 20 కోట్లమందికి కరోనా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు…