మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 17కి పెరిగింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
ఒమిక్రాన్ కట్టడి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఇవాళ, రేపు సెక్షన్ 144 విధించింది. దీంతో ముంబైలో ర్యాలీలు, సామూహిక కార్యక్రమాలను నిషేధించినట్లయ్యింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
మహారాష్ట్రలో మాత్రమే ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక కేసు నమోదయ్యింది.