ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.
అంతే కాకుండా నూతన సంవత్సర వేడుకల వేళ ఎక్కువ మంది జనాలు ఒకచోట గుమికూడకుండా ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మన దేశంలో ఇప్పటి వరకూ 422కిపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. 15 మంది రికవరీ అయ్యారు.