ఓయూ యూనివర్సిటీ మరో ఘనత..ఆ విద్యార్థులకు వీలుగా..

OU University is another credit..for those students ..

0
81

శత వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఓయూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి. నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ఐటీ బృందం 27 భాష‌ల్లో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఓయూలో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు దాదాపు 90 దేశాల విద్యార్థులు ఉన్నత విద్య‌ను అభ్య‌సిస్తున్నారు.

ఓయూ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ఇంగ్లీష్‌ భాషలోనే అందుబాటులో ఉండేది. దీంతో వారి వారి మాతృభాషల్లో ఓయూ సమాచారాన్ని పొందే వీలు ఉండాల‌నే ఉద్దేశంతో కొత్త‌గా 27 భాష‌ల్లో సైట్‌ను రూపొందించారు.

హిందీ, తెలుగు, మళయాళం, ఉర్దూ, అరబిక్‌, తమిళం, సంస్కృతం, మరాఠీ, కన్నడ, గుజరాతీ వంటి భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, గ్రీక్‌, డచ్‌, చైనీస్‌, రష్యన్‌, పర్షియన్‌, నేపాలీ, లాటిన్‌, జపనీస్‌, ఇటాలియన్‌, హంగేరియన్‌, ఇండోనేషియన్‌, ఐరిష్‌, మంగోళియన్‌ వంటి విదేశీ భాషల్లోకి సైతం వెబ్‌సైట్‌ను అనువదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఓయూ కీర్తి పతాకం మరింత ఉన్నతంగా ఎదగనుంది.