పాదయాత్రలో జగన్ వాటిపై కన్నేశారా…

పాదయాత్రలో జగన్ వాటిపై కన్నేశారా...

0
79

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్పయాత్ర చేసిన సంగతి తెలిసిందే… అయితే ఈ పాదయాత్రలో జగన్ కొన్ని భూములపై కన్నేశారని టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అరోపించారు…

తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడూతూ… జగన్ పాదయాత్రలో కన్నేసిన భూములను ఇప్పుడు అమ్మేందుకు పథకం పన్నారని ఆయన విమర్శించారు… కావాలనే రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించారని అన్నారు…

ఇసుక కొరత వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణానికి చెందిన కూలీలు సుమారు 60 మంది చనిపోతే కేవలం నలుగురికి మాత్రమే నష్టపనిహారాం అందించారని ఆయన మండిపడ్డారు.. త్వరలో తాను న్యాయవాదులతో కలిసి తూర్పుగోదావరి జిల్లోలో ఉన్న ఇసుక రీచ్ లను పరిశీలిస్తానని రాజప్ప హెచ్చరించారు…