అలా చేస్తే లోకేశ్ బండారం బయటపడుతుందట…

అలా చేస్తే లోకేశ్ బండారం బయటపడుతుందట...

0
86

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే ఆయన కుమారుడు నారాలోకేశ్ పై మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిప్పులు చెరిగారు… లోకేశ్ నాయకత్వం పనికి రాదని అన్నారు… లోకేశ్ నాయకత్వం పై సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు…. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమకు మూడు రాజధానులు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తమపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని అయితే తమను గెలిపించిన ప్రజలకోసం తాను టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు పంచకర్ల…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నఅభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చూసి తాను వైసీపీలో చేరానని అన్నారు… చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది విశాఖ ప్రజల వల్లే అని అన్నారు మంత్రి అవంతి.. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు…