పానీపూరి ఆమె ప్రాణాలు తీసింది- ఇలా తినవద్దు జర జాగ్రత్త

-

చాలా మంది పానీపూరిని లొట్టలు వేసుకుని తింటారు, ఎంతో టేస్ట్ గా ఉంటుంది, మరీ రేటు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి స్నాక్ ఫుడ్ గా బాగా తింటున్నారు, అయితే అమ్మాయిలకి ఫేవరేట్ ఫుడ్ కూడా పానీపూరి అనేది తెలిసిందే.. ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు ఈ చాట్ బండి దగ్గర.

- Advertisement -

అయితే ఇటీవల కొన్ని చోట్ల పానీపూరి తిని అస్వస్ధతకు గురి అయ్యారు అనే వార్తలు వింటూ ఉన్నాం.. అయితే కలిపే పాని సరిగ్గా ఉండకపోయినా ఆ బఠానీ పూరీలు వాసన వచ్చినా అవి పాయిజన్ ఫుడ్ అవుతాయి. అందుకే ఇవి తినే సమయంలో మంచి క్వాలిటీవి ఎవరు ఇస్తారో అక్కడే తినాలి.

ఒరిస్సాలోని సుందరగడ్ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్ పరిధి సరఫ్గడ్ గ్రామంలో రాత్రి ఈ విషాదం జరిగింది. స్థానికురాలైన ఫూలమతి కిషాన్అనే మహిళ సరదాగా మింగబోయిన గప్చుప్ ఆమె గొంతు గుండా శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఆమెకి మాట రాలేదు, ఇక శ్వాస తీసుకోలేకపోయింది, అందరి ముందు అలా కింద కుప్పకూలిపోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకువెళ్లారు కాని అప్పటికే శ్వాస ఆడక ఆమె చనిపోయింది, అయితే ఆమె నేరుగా పానీపూరీ మింగెయ్యడంతో ఇలా జరిగింది అని తేల్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...