పరిటాల కేసు విషయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు

పరిటాల కేసు విషయంలో మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు

0
92

మాజీ ఎంపీ హర్ష కుమార్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.. అంతేకాదు పరిటాల రవి హత్య కేసుకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు కూడా సీఎం జగన్ పై చేశారు. సీఎం జగన్‌ వైఖరంతా పగ, ప్రతీకారమే. పరిటాల రవి హత్య కేసులో ఆయనే నిందితులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు సప్లై చేశారు అని అతి పెద్ద ఆరోపణ చేశారు.

ఇవాళ జగన్‌ తరపున కొండారెడ్డి అనే వ్యక్తి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ వెల్లడించారు.జనవరి 26న ఖైదీలను విడుదల చేస్తూ జీవో ఇస్తాడని కొండారెడ్డి ఎదురుచూశాడు కాని ఆ జీవోలో రాలేదు అని …జగన్ కోసం జైలుకి వస్తే నాకు ఇదేనా ఇచ్చే అని బాధపడ్డాడు అని ఆయన తెలియచేశారు.

వైయస్ వివేకా హత్య కేసుని ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదు అని ప్రశ్నించారు, వైజాగ్ ని రాజధాని చేయాలి అని అనుకుంటున్నారు అది మంచి నగరం దాని పేరుని చెడగొట్టకండి అని వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు, అయితే హర్షకుమార్ తాజాగా ఈ కామెంట్లు చేయడం పై వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు, గత కేసుల గురించి చెప్పే హర్షకుమార్ ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మరి ఎందుకు నిరూపించలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు.