పరిటాల శ్రీరామ్ కు అప్పగించిన పని సూపర్ గా చేశాడు

పరిటాల శ్రీరామ్ కు అప్పగించిన పని సూపర్ గా చేశాడు

0
40

అనంతపురం జిల్లాలో ఉరవకొండ హిందూపురం రెండు సెగ్మెంట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.. మిగిలిన సెగ్మెంట్లు వైసీపీ గెలిచింది, అయితే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కంచుకోటగా హిందూపురం ఉంది అనేది తెలిసింది ..అయితే గెలుపు తథ్యం అనుకున్న రాప్తాడు అలాగే ధర్మవరం రెండు సీట్లు కూడా టీడీపీ కోల్పోయింది.. తర్వాత ధర్మవరం నుంచి పోటీ చేసిన తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ కేడర్ బయటకు వెళ్లకుండా ధర్మవరం సీటును కూడా పరిటాల ఫ్యామిలీకే కేటాయించారు చంద్రబాబు.

అయితే ఇక్కడ గడిచిన రెండు నెలలుగా ధర్మవరంలో తెలుగుదేశం పుంజుకుంది. అక్కడ పార్టీ కేడర్ అంతా ఒకే తాటిపైకి ఉన్నారు.. సీనియర్ నేతలు జూనియర్ నేతలు అందరూ కలిసి పని చేస్తున్నారు. ఇక్కడ పార్టీ ఏమవుతుందో అని పార్టీ అధినేత కూడా కంగారు పడ్డారు .. కాని ఇక్కడ గతంలో కంటే దూసుకుపోతోంది పార్టీ.

ముఖ్యంగా ధర్మవరం సెగ్మెంట్ బాధ్యతలు పరిటాల కుటుంబం చూసుకుంటోంది .. పరిటాల శ్రీరామ్ అక్కడ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో తమకు దగ్గర ప్రాంతం కావడంతో పరిటాల అనుచరులు కూడా పార్టీని మరింత పటిష్టం చేశారు.. దీంతో ధర్మవరంలో కచ్చితంగా వచ్చే స్దానిక సంస్ధల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగురవేస్తాం అంటున్నారు టీడీపీ నేతలు.