తెలుగుదేశంలో కీలక పోస్టుగా భావించే తెలుగు యువత అధ్యక్షుడి పోస్టుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పటి వరకూ ఆ పదవితో దేవినేని అవినాష్ కొనసాగారు. కాని ఆయన వైసీపీలో చేరడంతో ఆ పదవికి రాజీనామాచేశారు. దీంతో ఆ పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
ముఖ్యంగా సీమలో గెలిచింది మూడు సీట్లు కాబట్టి ఇక్కడ యువ నేతకు ఆ పదవి ఇవ్వాలి అని చూస్తున్నారు , తాజాగా తెరపైకి రాప్తాడు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పరిటాల శ్రీరామ్ కు ఆ పదవి ఇవ్వాలి అని బాబు భావిస్తున్నారట ..అయితే ఇప్పటికే రాప్తాడు ధర్మవరం రెండు సెగ్మెంట్లు పరిటాల కుటుంబం చూసుకుంటోంది. వారికి ఈ పదవి ఇస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరింత ప్లస్ అవుతుంది అని బాబు ఆలోచనగా తెలుస్తోంది.
త్వరలో చంద్రబాబు దీనిపై సీనియర్ నేతలతో చర్చింది ఆ పదవి శ్రీరామ్ కు ఇవ్వనున్నారు అని తెలుస్తోంది, మాజీ మంత్రి పరిటాల సునీత ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కుమారుడి కోసం రాప్తాడు సీటుని వదులుకున్నారు. కాని అక్కడ వైసీపీ గెలిచింది. అందుకే పరిటాల శ్రీరామ్ కు ఆ పదవి ఇవ్వాలి అని బాబు ఆలోచన అని సీమలో వార్తలు వస్తున్నాయి.