పరిటాల కుటుంబంలో ఒకేరోజు రెండు శుభవార్తలు

పరిటాల కుటుంబంలో ఒకేరోజు రెండు శుభవార్తలు

0
95

పరిటాల కుటుంబంలో ఓ ఆనందకరమైన వార్త అందరిని సంతోషంలో ముంచెత్తింది, అదే పరిటాల ఇంటికి వారసుడు వచ్చాడు,
అంతేకాదు ఒకేసారి రెండు శుభవార్తలు అందడంతో పరిటాల అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తండ్రి అయ్యాడు. సతీమణి జ్ఞాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.దీంతో వారి స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

సోషల్ మీడియా వేదికగా శ్రీరామ్ అభిమానులతో ఈ విషయం పంచుకున్నారు. శ్రీరామ్-జ్ఞాన జంటకు రాజకీయ నేతలు అధికారులు జిల్లా నేతలు పరిటాల అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు..మా రవన్నపరిటాల రవీంద్ర మళ్లీ పుట్టాడు అని పరిటాల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఈ ఆనందకరమైన సమయంలో చంద్రబాబు మరో గుడ్ న్యూస్ తెలిపారు ఆయనకు..టీడీపీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్కు చోటు దక్కింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పరిటాల శ్రీరామ్ నియమితులయ్యారు. దీంతో ఈ రెండు వార్తలు పరిటాల కుటుంబీకులని అలాగే అభిమానులని ఆనందంలో ముంచెత్తాయి, పరిటాల శ్రీరామ్, జ్ఞానలు 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారనే విషయం తెలిసిందే.