పరిటాల సునీతకు బిగ్ షాక్…

పరిటాల సునీతకు బిగ్ షాక్...

0
97

పేరూరు డ్యామ్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ద్వంసం చేశారు… ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ లు ఘటనా స్థలానికి చేరుకున్నారు… అక్కడికి టీడీపీ నేతలు భారీ గా తరలి రావడంతో పేరూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది…

కక్ష పూరితంగా గ్రామాల్లో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని గతంలో చేసిన అభివృద్ది చూసి ఓర్వకనే శిలాఫలకాలు ద్వంసం చేస్తున్నారని ఆరోపించారు.. ఈ విషయంపై మాజీ మంత్రి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు..

గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటను జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.. రాప్తాడు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మద్దెల చెరువు సూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు…