పార్టీ మార్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫుల్ క్లారిటీ…

పార్టీ మార్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫుల్ క్లారిటీ...

0
97

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొద్దికాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే… పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆయన ప్రధాని మోదీని కలిశారు… దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమయ్యారనే వార్తలు వచ్చాయి…

ఈ క్రమంలో వైసీపీ ఆయన్ను హెచ్చరించినా కూడా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు… అందుకే ఆయన కు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన ప్రత్యర్థి అయిన గోకరాజు ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి…

తాజాగా రాఘురామ కృష్ణం రాజు ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను వైసీపీలో ఉంటానని బీజేపీలో చేరనని అన్నారు… జగన్ మోహన్ రెడ్డి తానను ఏమాత్రం అనుమానించరని అన్నారు… అంతేకాదు తాను ఇంతవరకు ఏ పార్టీలోనూ శాశ్విత సభ్యత్వం తీసుకోలేదని ఎన్ని పార్టీలు మారినా గెలిపించేందుకే అని అన్నారు…