పవన్ కు జనసేన ఎమ్మెల్యే ఫోన్ జరిగింది ఇది

పవన్ కు జనసేన ఎమ్మెల్యే ఫోన్ జరిగింది ఇది

0
94

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ మాట అంటే ఆయన పార్టీ ఎమ్మెల్యే మరో మాట అంటున్నారు.. పార్టీకి దిక్కుగా భావిస్తున్న ఎమ్మెల్యే జగన్ పై ప్రశంసలు కురిపించడం మాత్రం జనసేన సైనికులు తట్టుకోలేకపోతున్నారు… తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు జగన్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో జగన్ పై జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రశంసలు ఇచ్చి జనసేనానికి షాక్ ఇచ్చారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదని, తెలుగు కూడా అవసరం అని చెప్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అన్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉండాలని తన ఉద్దేశ్యమని అన్నారు. పేదలకు ఇంగ్లీష్ విద్య ఉంటే మంచి స్టేజ్ కు వెళతారు అని ఈ ఎమ్మెల్యే అంటున్నారు.

తనకు జనసేన పార్టీలో ప్రాధాన్యత ఉందా …లేదా అనే దానిపై తరవాత మాట్లాడతానని రాపాక వర ప్రసాద్ అన్నారు.. జగన్ సంక్షేమ పథకాలు అమలు బాగుంది కానీ.. అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.తాను దీక్షకు అసెంబ్లీ సమావేశాల వల్ల వెళ్లడం లేదు అని తెలియచేశారు ..అయితే ఈ విషయం రాపాక పవన్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది అంటున్నారు అక్కడ పార్టీ నేతలు. అంతేకాదు అసెంబ్లీలో తాము మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన ఫోన్లో తెలియచేశారు అంటున్నారు అయితే రాపాక తన అభిప్రాయం చెప్పారు పార్టీ అభిప్రాయం కాదుఅంటున్నారు మరికొందరు అభిమానులు.