పవన్ కు షాక్… జగన్ కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

పవన్ కు షాక్... జగన్ కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

0
85

జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది… ఆ పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంను స్వాగతిస్తున్నామని అన్నారు….

అద్యక్షా… ఎస్సీ, ఎస్టీ, బీసీల కులాలకు చెందిన బలహీన వర్గాల కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తప్పితే అగ్రవర్ణాల పిల్లలు మొత్తం కార్పోరేట్ స్కూల్లల్లో చదువుతున్నారని అన్నారు… అందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి తాను స్వాగతిస్తున్నానని తెలిపారు…

చంద్రబాబు నాయుడు కూడా ఓ ప్రయత్నం చేశారని కానీ అది అక్కడే ఆగిపోయింది అన్నారు… మరో వైపు పార్టీ అధినేత పవన్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే….