పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్

పవన్ పై విజయసాయిరెడ్డి పంచ్

0
88

ఇసుక సమస్యను ఒక్క రోజులో పరిష్కరించే శక్తి ఉంటే ప్రజల కోసం ఆ పని చేయకుండా ఎవరాపారు చంద్రబాబునాయుడు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు… తుఫాన్లను దారి మళ్లించి, సముద్రాన్ని కంట్రోల్‌ చేయగల తమకు మాయల ఫకీరు మంత్ర శక్తులున్నాయని అందరికీ తెలుసు. వాటిని చేతబడులకు, శాపనార్థాలకు వాడకుండా ఉపయోగపడే పనులు చేయండని అన్నారు.

నిర్మాణ కార్మికులకు నిజంగా ఉపాధి పోయిందో లేదో కానీ… బాబుకు, ఆయన పార్ట్‌నర్‌ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో ఒకటే సెటైర్లవస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు.

రాంగ్ మార్చ్, ఒక్కపూట నిరాహార దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం వెయ్యి కుటుంబాలు ఏడాది కాలం పాటు జీవిస్తాయని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు….

దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన చింతమనేనికి, బలహీనవర్గాల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, పవన్లకు ఏం తేడా లేదని ఆరోపించారు. వీళ్లకు పేదోళ్లన్నా, నిమ్న వర్గాల వారన్నా చాలా చిన్న చూపు. ఎలక్షన్లలో చిత్తుగా ఓడించినందుకు ఇంకా కసి పెంచుకున్నారు.