ఏపీలో అన్ని ప్రాంతాల వారు డవలప్ అయితే ఏపీకి పేరు వస్తుంది అనేది ఇటీవల వైసీపీ నేతలు చెబుతున్న మాట.. అయితే అందరూ కోరుకునేది కూడా అదే.. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్లు అన్ని రంగాల్లో ముందున్నారని. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లు కూడా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆళ్ల ఆశించారు.. తాజాగా ఆళ్ల చేసిన కామెంట్లు బాగున్నాయి.. అయితే అన్ని విధాలుగా చూసుకున్నా గుంటూరు కృష్ణా డవలప్ అయ్యాయి.. అక్కడ కంటే రాజధాని ఉత్తరాంధ్రాలో ఉంటే మరింత డవలప్ అవుతుంది అనేది ఇప్పుడు వైసీపీ చెబుతున్న మాట.
ఇక దీనిపై వైసీపీ నిర్ణయం ఫైనల్ అనే భావించాలి, మూడు రాజధానుల నిర్ణయం అమలు చేసే విధంగా సర్కార్ ముందుకు వెళుతోంది. తాజాగా పవన్ పై ఎమ్మెల్యే ఆళ్ల కామెంట్లు చేశారు. చంద్రబాబు కొత్త బినామీ పవన్ అని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశాడన్నారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి పవన్ ప్యాకేజీలు తీసుకున్నాడని ఆరోపణలు చేశారు.
పవన్ ప్యాకేజీ తీసుకున్నాడనటానికి నిదర్శనమే.. మంగళగిరిలో జనసేన ఎవరినీ పోటీకి పెట్టకపోవడమని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మొత్తానికి
పవన్ పై ఎప్పుడూ టార్గెట్ చేయని ఎమ్మెల్యే ఆళ్ల తాజాగా ఇలా కామెంట్లు చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి, అయితే మంగళగిరిలో లోకేష్ కోసం పవన్ కల్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని ఎన్నికల సమయం నుంచి ఈ వార్తలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.