బాబుకి ఎమ్మెల్యే గిరి మరో షాక్

బాబుకి ఎమ్మెల్యే గిరి మరో షాక్

0
29

ఇటీవల గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్ను కలిసిన విషయం తెలిసిందే.. డవలప్ మెంట్ నిధుల గురించి ఆయనని కలిశాను అని తెలిపారు ఎమ్మెల్యే మద్దాలి గిరి, అయితే ప్రజల కోసం సీఎం జగన్ ని కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు… నా కోసం కలవలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశా అని చెప్పాను కదా అని గిరి తెలియచేశారు.

సీఎం జగన్ను కలిసిన వెంటనే చంద్రబాబు కనీసం తనను వివరణ కోరకుండానే తన నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించడం ఏమి న్యాయమో అర్థం కావడంలేదు అని అన్నారు.. దీనిపై చంద్రబాబుకు బహిరంగ లేఖ పంపుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గిరి.. ఇక టీడీపీ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీగా కోవెలమూడి రవీంద్ర నానీని చంద్రబాబునాయుడు నియమించారు.

ఎమ్మెల్యే గిరి పార్టీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు రావడం, జగన్ ని కలిశాను అని ఆయన నేరుగా చంద్రబాబుకి చెప్పకపోవడంతో, బాబు కూడా దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.. అయితే వివరణ ఎమ్మెల్యే ఇవ్వాలి కాని పార్టీ గీత దాటడం పై చంద్రబాబు సీరియస్ అవుతున్నారట.. అందుకే ఇంచార్జ్ ని నియమించారు అని గుంటూరులో పశ్చిమ సెగ్మెంట్లో చర్చించుకుంటున్నారు.