పవన్, బాలయ్యలపై రోజా జబర్దస్త్ కామెడీ….

పవన్, బాలయ్యలపై రోజా జబర్దస్త్ కామెడీ....

0
88

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు…. పవన్ కు జీవోల గురించి తెలియదని రోజా ఆరోపించారు… కొద్దికాలంగా ఆయన చీకటి జీవోలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు…

మూడు రాజధానులకు అనుగునంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని రోజా అన్నారు.. అయితే దీనికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు… ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ది చెప్పివుంటేబాగుండేదని అన్నారు…

రాయలసీమ నుంచి చంద్రబాబును అలాగే బాలయ్యను తరిమికొట్టే రోజులు వస్తాయని అన్నారు… పెద్దల సభలో పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలను తీసుకువచ్చారని ఆరోపించారు… చంద్రబాబు నాయుడు భజనపరులు సభలో ఉన్నారని రోజా మండిపడ్డారు… లోకేశ్ ఎమ్మెల్యే అవ్వలేరని ఆయన రాజకీయం సమాధి అవుతుందని అన్నారు…