పవన్ చంద్రబాబు లోకేష్ పై రోజా పంచ్ -ఇలా అనేశారేంటి

పవన్ చంద్రబాబు లోకేష్ పై రోజా పంచ్ -ఇలా అనేశారేంటి

0
87

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని బాలకృష్ణ బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. సీమని బాబు పట్టించుకోకపోవడం వల్లే బాలయ్యకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది అని అన్నారు.

వచ్చే రోజుల్లో రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణలను తరిమికొట్టే రోజు వస్తుందని ఆమె విమర్శించారు.
శాసనమండలి అంటే పెద్దల సభ అక్కడకు పెద్దలను కాకుండా దద్దమ్మలని తీసుకువచ్చారు అని రోజా విమర్శించారు.

మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులేనని అన్నారు. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేరని, ఆయన రాజకీయ భవిష్యత్తు సమాధి అయినట్టేనని అన్నారు. అందుకే ఆనాడు ఎమ్మెల్సీ ఇచ్చారు అని విమర్శించారు ఆమె.
కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేసిన కచ్చితంగా విశాఖ నుంచి రాజధాని పాలన మొదలవుతుంది అని తెలిపారు ఆమె…పవన్ కల్యాణ్ కు జీవోల గురించి ఏమాత్రం అవగాహన లేదని రోజా ఎద్దేవా చేశారు.