జగన్ పై పవన్ కల్యాణ్ దారుణమైన ట్వీట్

జగన్ పై పవన్ కల్యాణ్ దారుణమైన ట్వీట్

0
98

ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో అమలు చేస్తామని కొత్తగా జగన్ ప్రకటన చేయడంతో, ఇటు తెలుగుదేశం జనసేన పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు చేస్తున్నాయి.. తెలుగు చంపేయడానికి ఇది ప్రయత్నం అని మతం రంగు కూడా పులుముతున్నారు.. తాజాగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ , తాజాగా పలు ట్వీట్లు సీఎం జగన్ పై సంధించారు.

ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి…మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే…జగన్ రెడ్డి గారు భాష సరస్వతిని అవమానించకండి. జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి అని పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది. మాతృ భాషని ,మృత భాషగా మార్చకండి. ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు చెప్పాలి అని ట్వీట్ పెట్టారు