ఇటీవలే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉంటుందని తెలిపింది…
అయితే దీనిపై ప్రతిపక్షాలు తమ విమర్శలు చేస్తున్నాయి.. ఇటీవలే పవన్ ట్వీట్ కూడా చేశారు… ఇదిలా ఉండగా ఆంగ్ల విద్యా బోధన విషయంలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది… ముందుగా ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ఉంటుందని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు ఆరవ తరగతి వరకు మాత్రమే ప్రవేశ పెట్టాని తెలిపింది…
తాజాగా అధికారులతో సమీక్షా నిర్వహించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు… అంతేకాదు అన్ని పాఠశాలల్లో ఆంగ్ల ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని నాడు నేడు కార్యక్రమంలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు…