జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ విషయంలో త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న పవన్ కొద్దికాలంగా ఎటువంటి విమర్శలు చేయలేదు..
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ బీజేపీ నాయకులు కొద్దికాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా పవన్ మాత్రం మీడియా ముందు ఒక్కమాట కూడా అనలేదు… గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వానికి వందరోజులు సమయం కేటాయించారు.. కేటాయించిన ప్రకారం తర్వలో జగన్ వందరోజుల పాలనపై నివేదికను విడుదల చేయనున్నారు..
ఈ నివేదిక ఆధారంగా చేసుకుని జనసేన వైసీపీపై దాడి చేయనుంది టీడీపీ బీజేపీలకు దీటుగా విమర్శలు చేయాలని జనసేనని యోచిస్తోంది… దీని ద్వారా ఏపీలో జనసేనను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకుని టీడీపీకి ధీటుగా ఎదగాలని చూస్తోంది… త్వరలో విడుదల చేసే నివేదిక కోసం ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు.