పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ.

పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ.

0
92

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే… అయితే ఈ పొత్తుకు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందని ఆరోపిస్తోంది వైసీపీ… ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై టీడీపీ స్పందించింది…

బీజేపీ జనసేన పొత్తు వ్యక్తిగత విషయం అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు… తాజాగా అమరావతి జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన నిరసన దీక్షా శిబిరం వద్దం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు.. ముఖ్యమంత్రి జగన్ అనాలోచన నిర్ణయం వల్ల రాజధాని కోసం కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నాయని అన్నారు…

వైసీపీ నేతలకు ఎదుటివారిపై బురదజల్లడం అలవాటు అయిపోయిందని అన్నారు… అధికారంలోకి వచ్చినా కూడా పద్దతి మార్చుకోలేదని అన్నారు… 151 సీట్లు ఉన్నాయి కదా అని ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు