వైసీపికి పవన్ బిగ్ షాక్

వైసీపికి పవన్ బిగ్ షాక్

0
89

ఏపీలో ఇప్పుడు జనసేన కాస్త దూకుడు చూపిస్తోంది ఈ ఎన్నికల్లో ..అయితే వైసీపీకి ఇది చాలా మైనస్ అవుతుంది అని చెబుతున్నారు రాజకీయ పండితులు..దీనికి కారణం కూడా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. మొత్తానికి వైసీపీలో టికెట్ రాదు, పార్టీలో ఎంత కాలం ఉన్నా తమకు జగన్ టికెట్ ఇవ్వరు అనిభావించిన వైసీపీ ఇంచార్జులు సమన్వయకర్తలు కొందరు జనసేనానితో టచ్ లోకి వెళ్లారు .అంతేకాదు పార్టీలోకి వస్తే సీటు ఇస్తారా లేదా తెలుసుకుని జెండా మార్చేశారు.

ఇప్పుడు వైసీపీ తరపున నుంచి వచ్చి జనసేనలో నిలబడుతున్నవారు ఉన్నారు… వీరు అందరూ కూడా ఇప్పుడు వైసీపీ అభ్యర్దులకు ఏకై మేకై కూర్చున్నారు. వీరి వల్ల వైసీపీకి గోదావరి జిల్లాల్లో మరింత మెజార్టీ సీట్లు తగ్గుతాయి అని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో జగన్ కు ఇది పెద్ద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలో పవన్ వేవ్స్ వైసీపీ కంటే బలంగా ఉన్నాయి అని తెలుస్తోంది. కాపులు అందరూ కూడా ఇప్పుడు పవన్ బాబు వెంట ఉన్నారు, సో కాస్త వైసీపీ నేతలు ఈ విషయంలో టెన్షన్ లో ఉన్నారట.