ఆ ఎంపీ అభ్యర్దికి వైసీపీలో తిరుగులేదు

ఆ ఎంపీ అభ్యర్దికి వైసీపీలో తిరుగులేదు

0
60

తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఈ ఎన్నికలు గట్టి పోటీ అనే చెప్పాలి ..ముఖ్యంగా జనసేన మూడవ పార్టీగా ఉంది ..కొన్ని సెగ్మెంట్లలో ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేది జనసేన పోటీతో తెలుస్తోంది.. ముఖ్యంగా జనసేన నుంచి నరసాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పోటీ చేస్తున్నారు ఎంపీగా. వైసీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్నారు.. అసలు తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ఎవరూ అభ్యర్ది లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.

మరో పక్క చంద్రబాబు ఆలోచన ఎలా ఉన్నా, ఇక్కడ గెలుపు అంత సులువుకాదు టీడీపీకి, తెలుగుదేశం పార్టీకే కాదు అన్ని పార్టీల వారికి క్షత్రియసామాజిక ఓట్లు పడతాయి అని అంటున్నారు, ఎందుకు అంటే నిలబడిన అన్ని పార్టీల నేతలు క్షత్రియులే.. సో ఇక్కడ పార్టీ వేవ్స్ ప్రకారమే ఓట్లు పడతాయి. ముఖ్యంగా పార్టీ మారినా సీటు సంపాదించిన రఘురామకృష్ణం రాజుకి, జన బలం ఉంది..ఎందుకు అంటే ఆయన ఇక్కడవాడు. ఎంత పారిశ్రామిక వేత్తగా ఉన్నా ఇక్కడ అనేకసార్లు వస్తారు. అలాగే జిల్లాలో అనేక మందితో ఆయనకు మంచి రిలేషన్ ఉంది. ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి… పైగా ఏనాటి నుంచో ఎంపీ అవ్వాలి అని చూస్తున్నారు…. పైగా జిల్లా అభివృద్ది చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు అని జనం కూడా నమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలు అని చెబుతున్నారు ఇక్కడ నేతలు.