పేటీఎం ఖాతాదారులకి గుడ్ న్యూస్ మరో కొత్త సర్వీస్

పేటీఎం ఖాతాదారులకి గుడ్ న్యూస్ మరో కొత్త సర్వీస్

0
107

పేటీఎంతో సింపుల్ గా ఏ పేమెంట్ అయినా చేయచ్చు, డిజిటల్ వాలెట్ పేమెంట్లలో అద్బుతమైన పేరు సంపాదించింది, దేశంలో పేటీఎం వాడేవారు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు, అందుకు అనుగుణంగా సేవలు కూడా విస్తరిస్తోంది పేటీఎం.

ఆల్ సర్వీసెస్ ఇన్ వన్ ఫ్లాట్ ఫామ్ లా మారుస్తోంది, అన్నీ ఒకే రూఫ్ కింద చేసేలా పేటీఎం సరికొత్త ఆవిష్కరణలు సేవలు చేస్తోంది.త్వరలో స్టాక్ బ్రోకింగ్ సేవలను ప్రారంభించను న్నట్లు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు.

పేటీఎం ఇప్పటికే మన దేశంలో డిజిటల్ పేమెంట్లతో పాటు ఈ కామర్స్ రంగంలోనూ సర్వీస్ అందిస్తోంది, ఇక స్మాల్ బ్యాంకుగా సర్వీస్ ఇస్తోంది, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే సేవలకు సిద్దం అవుతోంది.. ఈ ఏడాది జనవరిలోనే పేటీఎం కు స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించేందుకు గాను సెబీ నుంచి అనుమతి కూడా లభించింది.పేటీఎం వెల్త్ అనే ఫీచర్ ద్వారా పేటీఎం స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించనుంది, ఇది ఖాతాదారులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.