కేసీఆర్ సర్కార్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్..317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై ఫైట్

0
98

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కెసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా దానిని తీసుకొచ్చారు. దానికి తాజా ఉదంతం బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య.

అడ్డగోలు బదిలీతో మనస్థాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగో…బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉంది.

ఈ చావులకు ప్రభుత్వమే కాదు…వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగ సంఘాలు కూడా బాధ్యులే. 317 జీవో రద్దు కోసం ప్రభుత్వం పై పోరాడుదాం. ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. కాగా ఇప్పటికే ఈ జీవోపై అటు ఉపాధ్యాయుల నుండి ఇటు ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది.